వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క

నవతెలంగాణ -తాడ్వాయి
మినీ మేడారం జాతర సందర్భంగా ములుగు ఎమ్మెల్యే, డాక్టర్ సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారక్క, పగడిద్దిరాజు, గోవిందరాజు వనదేవత లకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీర, సారే, సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు సీతక్కకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ఎస్ ఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, మాజీ జడ్పీటీసీ బొల్లు విజయదేవేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, సహకార సంఘ మాజీ అధ్యక్షులు పాక సాంబయ్య, జిల్లా నాయకులు అర్రేం లచ్చుపటేల్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్, తాండల శ్రీను, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.