విద్యార్థుల మీదే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉంది

– ఎమ్మెల్సీ డి.రాజేశ్వరరావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బి
విద్యార్థుల మీదే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ డి.రాజేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో డిప్లొమా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ నూతన క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ డి.రాజేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం సమాజం కోసం మంచి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిప్లొమా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్‌ విద్యార్థి సంఘాల నేత, డిప్లొమా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎరవెల్లి జగన్‌, బీఆర్‌ఎస్‌ రాంనగర్‌ డివిజన్‌ అధ్యక్షులు రావులపాటి మోజెస్‌, హెబ్రోన్‌ పాస్టర్‌ బ్రదర్‌ జీవరత్నం, ప్రభుదాస్‌, సామ్యూల్‌ పట్టా, అండ్రూ, జేఎన్టీయూహెచ్‌ డిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ నాయకులు ప్రేమ్‌ నగిశెట్టి, వివేక్‌ పటేల్‌ శివ శివకుమార్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.