సేంద్రియ ఎరువులతోనే..భూ పరిరక్షణ

– వ్యవసాయశాఖ అద్వర్యంలో రైతులకు అవగాహన 
నవతెలంగాణ-బెజ్జంకి 
సేంద్రియ ఎరువుల వినియోగంతోనే భూ పరిరక్షణ సాధ్యమవుతుందని వ్యవసాయశాఖాధికారులు సూచించారు. ప్రపంచ భూ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని అయా క్లస్టర్ గ్రామాల రైతు వేదికల్లో ఏఈఓలు రసాయన ఎరువులు, భూసార పరీక్షలపై రైతులకు అవగహన కల్పించారు. అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, ఏఈఓలు రేణుకా శ్రీ, మానస, మౌనిక, రచన, తేజస్వీని,ఆత్మాధికారి సాయిచరణ్, ఆర్ఎస్ఎస్ సభ్యులు, రైతులు హజరయ్యారు.