స్విగ్గీ నష్టాలు రెట్టింపు

న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ నష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2021- 22లో రూ.3,629 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.1,617 కోట్ల నష్టాలు నమోదు చేసింది. గడిచిన 2021-22లో సంస్థ వ్యయాలు ఏకంగా 131 శాతం పెరిగి రూ.9,574 కోట్లకు ఎగిశాయి. అధిక నిర్వహణ వ్యయాలు, నష్టాల నేపథ్యంలో మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉండచ్చనే అంచనాలు వెలుపడుతున్నాయి. ఆ సంస్థ మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. స్విగ్గీలో ఎలాంటి తొలగింపు ఉండబోవని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. గడిచిన అక్టోబర్‌లోనే అన్ని స్థాయిల్లో ఉద్యోగుల ప్రగతిని మదింపు చేశామన్నారు.