హయత్‌నగర్‌లో రోడ్డు ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి

హైదరాబాద్‌: నగర శివార్లలోని హయత్‌నగర్‌ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అనూష, హరికృష్ణగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.