హైదరాబాద్‌లో టీమ్‌ఇండియా..

హైదరాబాద్‌: శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుని మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా .. ఇదే ఊపులో మరో సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. తొలి వన్డేకు హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియం (రాజీవ్‌ గాంధీ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం టీమ్‌ఇండియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో పార్క్‌ హయత్‌ హౌటల్‌కి చేరుకున్నారు.