హైద్రాబాద్ లో జై విజ్ఞాన్ బాలల నాటికల పుస్తకావిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రముఖ కవి,రచయిత, బాలసాహితీవేత్త డా.కాసర్ల నరేశ్ రావు రచించిన బాలల నాటికలసంపుటి జై విజ్ఞాన్ ఆదివారం నాడు హైద్రాబాద్ లో తెలంగాణ సారస్వతపరిషత్తులో  ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ బాలసాహిత్య సమ్మేళనం సభాకార్యక్రమం, వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వచ్చిన, శాంతా బయోటిక్స్ అధినేత, పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బాలల కోసం, పెద్దలు రాయడం గొప్పకృషి అని,పిల్లలకు ప్రదర్శనయోగ్యమైన నాటికలు రాసిన డా.కాసర్లను అభినందించారు.
ఈ సభకు తెలంగాణ సారస్వతపరిషత్  అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య, డా.అమ్మంగి వేణుగోపాల్ ,మణికొండ వేదకుమార్, గరిపల్లి అశోక్,రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వందలమంది బాలసాహిత్యవేత్తలు, సేవకులు, విద్యార్థులుపాల్గొన్నారు. ఈ సభను బాలసాహిత్య కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా.పత్తిపాక మోహన్ నిర్వహించారు. నిజామాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ శర్మ, జె.శ్రీనివాస్, యం.మంజుల,  బాలసాహిత్య పరిశోధకులు సురేందర్ పాల్గొని డా.కాసర్ల ను అభినందించారు.