100% నవ్వించే సినిమా

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్‌ సాలే’. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాతగా, బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహింఇన చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్లు హరీష్‌ శంకర్‌, దశరథ్‌, వశిష్ట తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ,’ప్రణీత్‌ తీసిన ‘సూర్యకాంతం’ సినిమా నాకు నచ్చింది. ‘భాగ్‌ సాలే’ కథ నాకు చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అంతా సరదాగా సాగుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. కాల భైరవ ఇచ్చిన ఆర్‌ఆర్‌ అద్భుతంగా ఉంటుంది. తండ్రి పేరును నిలబెడతాడు. ఈనెల7న మంచి ఎంటర్టైన్మెంట్‌ సినిమా చూడబోతోన్నారు’ అని తెలిపారు.
”భాగ్‌ సాలే’ అనేది క్రైమ్‌ కామెడీ జోనర్‌. ట్రైలర్‌ చూశాక సినిమా హిట్‌ అవుతుందని మరింత నమ్మకంగా కలిగింది. మ్యూజిక్‌ బాగా వచ్చింది. కాల భైరవ రీరికార్డింగ్‌ అద్భుతంగా వచ్చింది. ప్రణీత్‌కు మంచి ఫ్యూచర్‌. ఆయనతో త్వరలోనే మరో సినిమా చేస్తాను. దళపతి విజరులో ఉండే ఇన్నోసెన్స్‌ సింహాలో ఉందని ఓ ఓటీటీ హెడ్‌ అన్నారు’ అని నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ అన్నారు. హీరో శ్రీ సింహా మాట్లాడుతూ, ‘మా సినిమా గురించి వీడియో బైట్‌ ఇచ్చిన చిరంజీవికి థ్యాంక్స్‌. ఈ చిత్రంతో అందర్నీ కచ్చితంగా నవ్విస్తాం’ అని అన్నారు. మరో నిర్మాత యశ్‌ రంగినేని మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ఇప్పటికే రెండు సార్లు చూశాను. ఎంతో ఎంటర్టైనింగ్‌గా వచ్చింది’ అని తెలిపారు.
మా సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డకు థ్యాంక్స్‌. ‘భాగ్‌ సాలే’ అనేది యూనిక్‌ టైటిల్‌. ఈ సినిమాలో అన్నీ కూడా యూనిక్‌ కారెక్టర్లుంటాయి. ఇందులో ఖతర్నాక్‌ కారెక్టర్‌ ఉంటుంది. శ్రీసింహా అద్భుతంగా నటించారు. ఇప్పుడు సినిమాలన్నీ కూడా ధమ్‌ బిర్యానీలా బ్లాక్‌బస్టర్‌ అవుతున్నాయి. మాది ఇరానీ చారు లాంటి సినిమా. ఎంతో సంతప్తిని ఇస్తుంది. మిమ్మల్ని వంద శాతం నవ్విస్తుంది. కచ్చితంగా ఎంజారు చేస్తారు.
– దర్శకుడు ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి

Spread the love