2023 కాలమాలని ఆవిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్
స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ స్ట్రక్షన్ మానసిక వికలాంగుల పాఠశాలలో కాలమానిని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ యొక్క 2023 కాలమానిని గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా సంక్షేమ ఆధికారి సుధారాణి ముఖ్య అతిధిగా పాల్గోని కాలమునిని ఆవిష్కరించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగ బాలలు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ప్రతి సంవత్సరం కాలమని ఆవిష్కరిస్తున్న స్నేహ సొసైటీని అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిదులుగా స్నేహసొసైటి కార్యవర్గ సభ్యులు యస్. సిద్ధయ్య కార్యదర్శి, దయానంద్ సంయుక్త కార్యదర్శి,  సుధాకర్ కార్యవర్గ సభ్యుడు, యస్. జ్యోతి ప్రిన్సిపల్, పి. రాజేశ్వరి వైస్ ప్రిన్సిపల్, మునసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, అంధుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గోన్నారు.