ఊహించని 3 ట్విస్టులు..

‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా సక్సెస్‌ఫుల్‌గా అరంగేట్రం చేసిన బెల్లంకొండ గణేష్‌ ‘నేను స్టూడెంట్‌ సర్‌’తో థ్రిల్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నిర్మాత ‘నాంది’ సతీష్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ, ”నాంది’తో మా సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ గుర్తింపుని ఈ సినిమా మరింత పెంచుతుంది. మంచి థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ సినిమా వెళ్తుంది. బెల్లంకొండ గణేష్‌ ఈ కథకు చక్కగా సరిపోయారు. కృష్ణ చైతన్య ఈ కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్‌
అయ్యాను. కథ ఒక మొబైల్‌ ఫోన్‌తో స్టార్ట్‌ అవుతుంది. స్టూడెంట్స్‌ మంచి ఐఫోన్‌ కొనుక్కోవాలని చాలా తాపత్రయ పడతారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది?, అలాగే ఇందులో మూడు మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్ట్‌లుఉన్నాయి.నితిన్‌ సినిమాతో కృష్ణ చైతన్య బిజీగా ఉండటంతో రాకేష్‌ దర్శకత్వం వహించారు. యూనీవర్సిటీలో స్టూడెంట్‌ లైఫ్‌తోపాటు మనం పేపర్‌లో చదివిన ఓ రెండు సంఘటనలు ఇందులో చూపించాం. అవి స్క్రీన్‌పై చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతిక తన పాత్రని చాలా చక్కగా చేసింది. మహతి స్వరసాగర్‌ మ్యూజిక్‌ అద్భుతం. ఇందులో చాలా బ్యూటీఫుల్‌ సాంగ్స్‌ ఉన్నాయి. బీజీయం నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ తరహాలో ఫిక్షనల్‌ బయోపిక్‌ చేస్తున్నాను. దీనికి రాకేష్‌ దర్శకత్వం వహిస్తారు’ అని అన్నారు.

Spread the love