– బహుమతుల ప్రదానం
నవతెలంగాణ-డిచ్ పల్లి
గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడి నాలుగు ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ ఏటా లోకి వెళుతున్న సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి గద్దె భూమన్న, పాల్గొని మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా గ్రామ అభివృద్ధి కి సర్పంచ్ పానుగంటి రూపా సతిష్ రెడ్డి పాలకవర్గంతో కలిసి అభివృద్ధి చేయడంలో కృషి చేశారని ఎంపిపి గద్దె భూమన్న వివరించారు.
అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి మొదటీ, రెండోది మూడో బహుమతి సర్పంచ్ రూపా సతిష్ రెడ్డి, ఎంపీపీ గద్దె భూమన్న, ఎంపిటిసి ఎంబడి సంతోషం, గ్రామ పంచాయతీలో గత 15, 20 ఏళ్లుగా సేవలందించి వయోభారంతో వెళ్లిపోయిన గంగారం మీనయ్యకి పదివేల రూపాయలు గ్రామపంచాయతీ నుండి ఆర్థిక సహాయం అందజేశారు. అంతకు ముందు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శుద్ధ గంగారం సొసైటీ, వైస్ చైర్మన్ డైరెక్టర్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, డ్వాక్రా మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.