ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనం ప్రారంభోత్సవం

– కంటి వెలుగు, మన ఊరు మన బడి పనుల పరిశీలన
– పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలో అన్ని హంగులతో 50 లక్షల రూపాయల నిధులను వెచ్చిస్తూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్ లతో కలిసి మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభోత్సవం చేశారు. వృద్ధాశ్రమం ఆవరణలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమంలోని వివిధ విభాగాలను సందర్శించి సదుపాయాలను పరిశీలించారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు  డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బీ, యానంపల్లి తండాలో కంటి వెలుగు శిభిరంను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖి చేశారు. వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పూర్ గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో బాగంగా జరుగుతున్నా పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఆకస్మికంగా తనిఖి చేశారు.వీరి వెంట జెడ్పిటీసి బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిరా లక్ష్మి నర్సయ్య, డిఎంహెచ్ ఓ డాక్టర్ సుదర్శనం, సర్పంచ్ పాపాయి తిరుపతి,సర్పంచ్ పత్తి మమత ఆనంద్, ఉప సర్పంచ్ యెంకనోల్ల రమేష్, సోసైటి చైర్మన్ తరచంద్ నాయక్, డీడబ్ల్యుఓ సుధారాణి, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపిడిఓ గోపి బాబు, సర్పంచ్ లంబాని నీల తదితరులు ఉన్నారు.