టీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు..45 మంది ప్రయాణికులు!

TSRTC-BUS
TSRTC-BUS

నవతెలంగాణ – హైదరాబాద్
పెద్ద అంబర్‌ పేట్‌ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తప్పిన పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి గుంటూరు వెళ్తున్న రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే..మంటలు చెలరేగడంతో.. ఇంజన్ తో సహా బస్సు ముందు భాగం మొత్తం దగ్ధం అయింది. ఫ్యూయల్ లీకేజ్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక బస్ రన్నింగ్ లో ఏదో కాలుతున్న వాసన రావడంతో అప్రమత్తమైన డ్రైవర్.. ఒక్కసారిగా వ్యాపించిన మంటలు చూసి..ప్రయాణికులను అలర్ట్‌ చేశాడు. ఫైర్ ని గమనించి ప్రయాణికులను దింపేసిన డ్రైవర్..ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అయితే.. డ్రైవర్ అప్రమత్తతతో ఈ పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో పంపించారు అధికారులు.

Spread the love