హైదరాబాద్ : స్పూర్తినిచ్చే వ్యక్తులను ఒక్క చోటకు చేర్చే టెడ్‌ఎక్స్ హైదరాబాద్ తన 9వ ఎడిషన్‌ను సెప్టెంబర్ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వెన్షన్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. టెడ్‌ఎక్స్ 2023 పోస్టర్‌ను నటుడు టెడ్‌ఎక్స్ స్పీకర్ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. సమాజంలో మార్పును రేకెత్తించే పరివర్తన ఆలోచనలను రేకెత్తించడానికి టెడ్‌ఎక్స్ హైదరాబాద్ ఒక వేదిక అని ఆ సంస్థ క్యూరెటర్, లైసెన్సీ వివేక్ వర్మ పేర్కొన్నారు. విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన 12-16 మంది స్పీకర్‌లను ఒకచోట చేర్చి వారి ఆలోచనలు, అనుభవాలను ఈ వేదిక పంచుకోనుందన్నారు.