వర్షానికి కూలిన బేకరీ దుకాణం

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అజార్ బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు, పట్టణంలో బేకరీ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బేకరీ నడుపుతున్న ఇల్లు కూలి పోగా, ఇంట్లో ఉన్న బేకరీ వస్తువులు ధ్వంసం అయ్యాయి. సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.

Spread the love