పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

– బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి :బీసీ సంక్షేమ సంఘం నేత, రాజ్యసభ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య
– జూలైలో లక్షలాది మందితో పార్లమెంట్‌ ముట్టడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలైలో బీసీ సంఘం ఆధ్వర్యంలో లక్షలాది మందితో పార్లమెంట్‌ను ముట్టడించనున్నట్లు రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్‌. కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఏపీ భవన్‌లో బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు ఎన్‌. మారేష్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో భారీ బహిరంగ సభలు జరపాలని, బీసీలు పార్టీలక తీతంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయం చేశారు. అలాగే ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంటగా బత్తుల హరి ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో గత 75 ఏండ్లుగా పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదన్నారు. ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామా జిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలని, కానీ 70 ఏండ్లుగా బీసీలకు వాటా ఇవ్వడం లేదని విమర్శించారు. దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంద న్నారు.వారికి రావాలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలని డిమాండ్‌ చేశారు. 56 శాతం జనాభా గల బీసీలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిథ్యం లేదంటే బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలుపుతుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. మారేష్‌ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రాతిపదికన 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని కోరారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయ మూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని, కేంద్రం లో బీసీలకు పోస్ట్‌ మెట్రిక్స్‌ స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్‌మెంట్‌ స్కీము విధానం సాచురేషన్‌ పద్ధతిలో ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగా లను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో రెండు లక్షల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల్లో బీసీ కులాల లెక్కలు సేకరించాలని కోరారు. బత్తుల వెంకటరమణ మాట్లాడుతూ జూలైలో 25వేల మందితో కదిరి నియోజకవర్గంలో బీసీ గర్జన నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో భాషయ్య, వేలు, జనా ర్ధన్‌, రాహుల్‌ తది తరులు పాల్గొన్నారు.

Spread the love