తెగిన మిని వంతెన…

– నిజామాబాద్ కు రాకపోకలు బంద్..
– పరిస్థితి సమిక్షించిన అర్&బి అధికారులు..
– ఇబ్బందులు పడుతున్నా ప్రజలు..
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని మాధవనగర్ రైల్వేగేటు- సాయిబాబా మందిరంకు మధ్యలో ఉన్న మిని వంతెన నీటి ప్రవాహనికి పూర్తిగా తెగిపోయింది. దీంతో నిజామాబాద్ నుంచి మాధవనగర్ గేటు నుండే హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు తివ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కోన్ని నేలల నుండి రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులకు గాను లారిలను, బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకలను బంద్ చేశారు. గత రెండు నెలల క్రితం ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రాకపోవడాని కోసం పైప్ లైన్ వేసి పైన మట్టి వేసి రాకపోకలను పునరుద్దరించారు.అనునిత్యం సాయిబాబా మందిరం ఎదుట నుంచి వందలాది మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన తెగిపోవడంతో రాకపోకల బంద్ ఆయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలు ఆనుమతి లేనప్పటికిని 24 గంటలపాటు లారీలు, వ్యాన్లు రాకపోకలు సాగిస్తున్న పట్టించుకునే నాథుడు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని పలువురు తెలిపారు. రాత్రి ఒక వ్యాన్ బురదలో కూరుకుపొయింది. ఆదే సమయంలో భారీ వర్షం కురియడంతో వంతెన పూర్తిగా కొట్టుకు పోయిందని స్థానికులు తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి రాకపోకలు సాగించాలంటే మాధవనగర్ గేటు వద్ద ఉన్న బైపాస్ నుండి కిలోమీటర్ల మేర తిరిగి వేళ్ళవల్సిన దుస్థితి నెలకొందని పలువురు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు అబ్బందులు తప్పడం లేదు. మిని వంతెనను ఆర్ ఆండ్ బిఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ సురేష్, డీఈ ప్రవీణ్ లు పరిశీలించారు.
Spread the love