పరీక్షలో విద్యార్థికి సమాధానాలు రాసిచ్చిన అధికారిపై కేసు

– ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలో ఘటన
నవతెలంగాణ-బేగంపేట
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థికి సమాధానాలు రాసిచ్చిన అధికారిపై ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్‌ నగర్‌లోని అమోఘ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా.. జూన్‌ 15న గణితం-బి పరీక్ష జరిగింది. ఆ సమయంలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ ఆంజనే యులు ఓ విద్యార్థికి పెన్సిల్‌తో సమాధానాలు రాసి అందించాడు. ఇది గుర్తిం చిన పరీక్షా కేంద్రం అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్‌రావు పరీక్షల హైపవర్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి డి.ఒడ్డెన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు.

Spread the love