రొటీన్‌కి భిన్నమైన చిత్రం

ఏఎమ్‌ఎఫ్‌, కోన సినిమా బ్యానర్లపై అనిల్‌ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్‌’. కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్‌ లైన్‌. శివ కోన, ఈటీవీ ప్రభాకర్‌, నేహా దేశ్‌ పాండే, కునాల్‌ కౌశల్‌, ప్రాచీ కెథర్‌, రమ్య గిరీష్‌, అభిలాష్‌ బండారి తదితరులు నటిస్తున్నారు. శివ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మీడియాతో డైరెక్టర్‌ శివకోన మాట్లాడుతూ,’ఇది చిన్న బడ్జెట్‌ సినిమాలా లేదని పెద్ద సినిమాలా ఉందని అందరూ అనటం హ్యాపీగా ఉంది. సినిమాను కచ్చితంగా థియేటర్లోనే ఆగస్టు 4న చూడండి. లేదంటే మీరు ఎంతో మిస్‌ అవుతారు’ అని తెలిపారు. ‘డైరెక్టర్‌ శివ కోనకు విజన్‌తో పాటు, ప్లానింగ్‌ కూడా అద్భుతంగా ఉంది. కొన్నిసార్లు స్టార్‌ హౌటల్స్‌లో బిర్యాని తిన్నదానికన్నా మామూలు హౌటల్స్‌లో తిన్న బిర్యాని చాలా రుచిగా బాగుంటుంది. అలాగే ‘రాజు గారి కోడి పులావ్‌’ కూడా మీకు నచ్చుతుంది’ అని ఈటీవీ ప్రభాకర్‌ అన్నారు.
హీరో అభిలాష్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా రొటీన్‌గా ఉండదు. చాలా కొత్తగా, మిస్టీరియస్‌గా ఉంటుంది’ అని తెలిపారు. రచన సహకారం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన రవి మాట్లాడుతూ,’ప్రేక్షకులను సంతృప్తి పరిచే కంటెంట్‌ ఇందులో ఉంది. దర్శకుడు శివకోన ఎంతో కష్టపడ్డారు’ అని చెప్పారు.

Spread the love