ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

యూవీటీ స్టూడియోస్‌ హాలీవుడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్‌ సింగ్‌ నేగి, అశోక్‌ ఖుల్లార్‌ నిర్మిస్తుండగా, షేర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఓ ముఖ్య పాత్రను కూడా ఆయన పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర టైటిల్‌ లోగోను తాజాగా సుమన్‌ రిలీజ్‌ చేశారు. టీఎఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకష్ణ గౌడ్‌, టీఎఫ్‌సీసీ వైస్‌ చైర్మన్‌ గురురాజ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. షేర్‌ మాట్లాడుతూ, ‘నటుడిగా, హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా ఇలా పలు శాఖల్లో పని చేశాను. నాకు ఈ ఇండిస్టీలో భాష్య శ్రీ, డైరెక్టర్‌ బాలా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’ అని తెలిపారు.

Spread the love