అందరం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న 

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగుంటారని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. గురువారం స్నాబాద్ పట్టణంలో బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ బాలవికాస స్వచ్ఛంద సంస్థ  క్యాన్సర్ పై అవగాహన కల్పించడం చాలా మంచి ఆలోచన అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రత్యేకించి మహిళలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్క్రీన్ టెస్ట్ మరియు హెల్త్ చెకప్ చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్  ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి ,సూపర్డెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి రమాదేవి , కేడం లింగమూర్తి, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ ధర్మ, జ్యోతి, మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.