అద్భుతమైన యాక్షన్‌ ప్రయాణం

హస్బ్రో ట్రాన్స్‌ఫార్మర్స్‌ టారు ఆధారంగా తెరకెక్కించబడిన పాపులర్‌ చలన చిత్ర ఫ్రాంచైజీ లైన్‌. మైఖేల్‌ బే నిర్మాణంలో ఇప్పటివరకు ఆరు సినిమాలు నిర్మితమయ్యాయి. 6వ చిత్రం ‘బంబేబీ’ (2018)ని నిర్మించగా, మొదటి 5 చిత్రాలు ట్రావిస్‌ నైట్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భాగంగా ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌’ 7వ విడత సిరీస్‌ అలాగే బంబేబీకి కొనసాగింపుగా ఉంటుంది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ద్వారా ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు కొచ్చింది. హిందీలో 2డి, 3డి, 4కె, ఐమాక్స్‌ ఫార్మెట్‌లో విడుదలై అన్ని వర్గాలను విశేషంగా అలరిస్తోంది. ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ సిరీస్‌ చిత్రాలు సినిమా ప్రేక్షకులకు చేరువయ్యాయి. అద్భుతమైన యాక్షన్‌ ప్రయాణంతో ఇప్పటి వరకు తెరకెక్కిన 6 సినిమాలకు మించి ‘ట్రాన్స్ఫార్మర్స్‌: రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌’ ఉండటం విశేషం. ఆటో బోట్‌లతో 90ల గ్లోబ్‌ ట్రాటింగ్‌ అడ్వెంచర్‌ని ఈ సినిమా ప్రేక్షకులు పరిచయం చేయటం మరో విశేషం.నోV్‌ా (ఆంథోనీ రామోస్‌), ఎలెనా (డొమినిక్‌ ఫిష్‌బ్యాక్‌) నటన, సాహసాలు హైలెట్‌గా నిలిచిన ఈ చిత్రానికి దర్శకత్వం – స్టీవెన్‌ కాపుల్‌ జూనియర్‌.

Spread the love