మిషన్‌ తషాఫిలో కీలక పాత్ర

ఓటీటీ మాధ్యమం జీ5 రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘మిషన్‌ తషాఫి’లో తిరువీర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని జీ 5 అధికారికంగా ప్రకటించింది. ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్‌ చేస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఫిల్మ్‌ రిపబ్లిక్‌ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరు వీర్‌ బర్త్‌ డే సందర్బంగా చేసిన ఈ ప్రకటనతో ఈ వెబ్‌సిరీస్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇండియాలో భారీ విధ్వంసాన్ని సష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్‌ రా ఏజెంట్స్‌కి మధ్య నడిచే భావోద్వేగమైన హై ఇన్‌టెన్స్‌ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ఇది. 8 ఎపిసోడ్స్‌ ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఇప్పటి వరకు తెలుగు ఓటీటీలో ఎవరూ నిర్మించని రీతిలో దీన్ని భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో జీ5 రూపొందిస్తోంది. అంతే కాకుండా తొలిసారి విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి తెలుగు సిరీస్‌ కూడా ఇదే. అలాగే ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ నేతత్వంలో ఫైట్స్‌ను డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు చిత్రీకరిస్తున్నారు అని మేకర్స్‌ అన్నారు.

Spread the love