ఇద్ద‌రు టీనేజ‌ర్ల‌ను క‌త్తితో పొడిచి చంపిన ఉన్మాది..

నవతెలంగాణ – ఇంగ్లండ్
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలు) ఘటన చోటు చేసుకుంది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. మరో యువతి అఖిల తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తేజస్విని, అఖిల మరికొంత మంది స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. ఎంఎస్‌ కోసం రెండున్నరేళ్ల క్రితం తేజస్విని లండన్ వెళ్ళింది. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్‌లో చదువుతోంది. ప్రస్తుతం వెంబ్లి ప్రాంతంలోఉంటుంది. కాగా, దాడికి పాల్పడిన బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి తేజస్విని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండే వారని సమాచారం. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట. ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రిషన్. మృతురాలు తేజస్విని అన్న పవన్ కుమార్ రెడ్డి అస్ట్రేలియలో ఉంటాడు. ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, ఆగస్ట్‌లో వస్తానని తేజస్విని తన తల్లితండ్రులతో చెప్పింది. ఇక దుండగుడి దాడిలో గాయపడిన మరో అమ్మాయి అఖిలది జనగాం జిల్లా ఆలేరుగా తెలిసింది.

Spread the love