దొరల పెత్తనంపై తిరుగుబాటు

జగపతి బాబు, మమతా మోహన్‌ దాస్‌, విమల రామన్‌, ఆశిష్‌ గాంధీ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఎమ్మెల్యే డాక్టర్‌ రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన అజరు సామ్రాట్‌ దర్శకత్వం వహించారు. జూలై 7న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
‘రుద్రంగి అనే ఊరిలో భీమ్‌ రావ్‌ దొర అణిచివేతకు ప్రజా తిరుగుబాటు ఎలా సమాధానం చెప్పింది అనేది ట్రైలర్‌లో కనిపించింది. దొరల పెత్తనంలో ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను చూపించారు. నాటి తెలంగాణలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి?, వాటిని ఎదిరించి ప్రజలు చేసిన సాససోపేత పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది. భీమ్‌రావ్‌ దొరగా జగపతిబాబు, జ్వాలాభారుగా మమతా మోహన్‌ దాస్‌, మల్లేష్‌గా ఆశిష్‌ గాంధీ పాత్రలు ఆకట్టుకుంటాయి. ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమాలో భారీతనం, దర్శకత్వ ప్రతిభను ట్రైలర్‌ చెప్పకనే చెప్పింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో ఇలాంటి భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రాన్ని నిర్మాతగా రసమయి నిర్మించడం ఓ సాహసమే అయితే, ఆయన ఈ చిత్రం కోసం ఆయన పాడిన పాట సినిమాకే హైలెట్‌ అవుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love