క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన

నవతెలంగాణ – కంటేశ్వర్
పొగ త్రాగే వారు, పాన్ మసాలా నమిలేవారు, గుట్కా తినేవారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రముఖ డాక్టర్ పి. రామ్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం అర్సపల్లి నందు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ మరియు అర్సపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ లావణ్య నవీన్ అధ్యక్షతన జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులను వాడేవారిని ముందుగా గుర్తించి స్క్రీనింగ్ చేస్తామని, మహిళలు కూడా స్వయంగా తమకు తామే క్యాన్సర్ లక్షణాలు గుర్తుపట్టే విధంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నియంత్రించవచ్చని ఆయన అన్నారు. అరసపల్లిలో నిర్వహించిన ఈ క్యాంపుకు అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు హాజరయ్యారు. మెమోగ్రామ్, పాప్స్ మి యర్, ఈసీజే, ఎక్సరేలు తదితర టెస్టులు నిర్వహించటం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో అర్శపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ నాయకులు రామ్మోహన్రావు, ఈ విఎల్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love