మెప్పించే యాక్షన్‌ థ్రిల్లర్‌

ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్‌ వర్మ రేఖ తారాగణంగా ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ పక్కా యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ముగించుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా హీరో వెంకట్‌ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌.కె. గాంధీ మాట్లాడుతూ, ‘వెంకట్‌ బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన ఓ మెయిన్‌ రోల్‌ని సురేష్‌ కొండేటి చేశారు. జూన్‌ 23న రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్‌ఫుట్‌ వచ్చింది. ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా అందరి ప్రశంసలను సొంతం చేసుకుంటాడు’ అని నిర్మాత కొండ్రాసి ఉపేందర్‌ అన్నారు. హీరో సాయి మణితేజ మాట్లాడుతూ,’ఇందులో చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్‌ చేసిన దర్శకుడు గాంధీకి ధన్యవాదాలు’ అని తెలిపారు.

Spread the love