నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ గ్రామాంలోని ఓ బావిలో చిరుత పులి పడిపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బందో లేక పోలీసులో తెలియదు కానీ, ఎవరో ఒకరు వచ్చినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. బావిలోకి ఓ నిచ్చెన విడిచి పెట్టారు. దాని సాయంతో చిరుత పైకి వస్తుందేమోనని చూశారు. కానీ పైన జనాలు ఉండేసరికి ప్రాణభయంతో అది బయటకు రావడం లేదు. దీంతో ఓ పొడవాటి కర్రకు చివర్లో గుడ్డ చుట్టి దానికి మంట అంటించారు. ఆ కర్రను కిందకు పంపించి చిరుత పులిని బెదిరించారు. దీంతో అది అక్కడి నుంచి నిచ్చెన ఎక్కి బయటకు వచ్చింది. బావి మీద నుంచి గోడమీదకు దూకేసి, ఆ తర్వాత మైదానంలో పరుగున పారిపోయింది. ఈ వీడియోని సహానా సింగ్ అనే రచయిత షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.