చికిత్స పొందుతూ యువకుడు మృతి

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ధర్మొర గ్రామానికి చెందిన సాయనోల్ల శ్రీనివాస్(32) చికిత్స పొందుతు సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ యాదగిరిగౌడ్ సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 17వ, తేదీన గొట్టుముక్కల గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొనడంతో మాధాపుర్ గ్రామానికీ చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి దర్మొర గ్రామానికీ చెందిన శ్రీనివాస్ ను బైక్ తో ఢీ కొన్నయ్యని, చికిత్సా నిమిత్తం నిజమాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం శ్రీనివాస్ మరణించడం జరిగిందన్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య లక్ష్మిదేవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.