ప్రియుడి మర్మాంగం కోసిన యువతి

నవతెలంగాణ – హైదరాబాద్
బిహార్‌లోని పట్నాలో ఓ యువతి తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తనను రహస్య వివాహం చేసుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. బాధితుడు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తన ప్రేమికుడికి ఈ నెల 23న మళ్లీ పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. ప్రియుడిని పట్నాలోని ఓ హోటల్‌కు రప్పించింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Spread the love