సర్వే నంబర్ల ప్రకారం రైతులు సాగు చేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలి..

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
సర్వే నంబర్ల ప్రకారం రైతులు సాగు చేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేసే విధంగా చూడాలని  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని వెంగల్ పడ్ (పాటితండా) గ్రామం లో వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేసిన పంట వివరాలను రైతులతో క్షేత్ర స్థాయి లో మాట్లాడి పంటలను పరిశీలించి తగు సస్య రక్షణ చర్యలను వివరించారు.వర్షాల వల్ల పంటలు దెబ్బ తినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఆరుతడి పంటల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సందేహాలు ఏమైనా ఉంటే దానిని నివృత్తి చేసుకోవడానికి మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులకు  తేలపలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సంగెం ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీహరి, సతీష్, ప్రకాశ్ గౌడ్ రైతులు పాల్గొన్నారు.