హైకోర్టును ఆశ్రయించిన నటి డింపుల్‌ హయాతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ నటి డింపుల్‌ హయాతి హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే ఒత్తిడి కారణంగానే తనపై కేసు నమోదు చేశారనీ, ఆయన కారు డ్రైవర్‌ చేతన్‌ కమార్‌ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేశారని తెలిపారు. కారుపై దాడి చేశారనే ఆరోపణలకు ఆధారాలు చూపలేదన్నారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ అనుపమ చక్రవర్తి బుధవారం విచారించారు. ఆమెతోపాటు న్యాయవాది విక్టర్‌కు 41ఎ నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 41 ఎ నోటీసు అందుకున్న తర్వాత వాళ్లిద్దరూ పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Spread the love