ధనుకా గ్రూప్‌ స్టాల్‌ను సందర్శించిన వ్యవసాయ మంత్రి

హైదరాబాద్‌ : నగరంలో జరుగుతున్న హైదరాబాద్‌లో జరుగుతున్న జి20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ స్టాల్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ సందర్శించారని ఆ సంస్థ తెలిపింది. వ్యవసాయ రంగానికి తమ సంస్థ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కౌలాష్‌ చౌదరి కూడా పాల్గొన్నారు. గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌జి అగర్వాల్‌తో వ్యవసాయ రంగంలో వివిధ అవకాశాలు, వ్యవసాయ రసాయన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించారని పేర్కొన్నారు.

Spread the love