పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

– రైతులు సూచనలు పాటించాలి 
– పురుగుల నివారణకు మందులు పిచికారీ చేయాలి
– మొక్కజొన్న, కంది, పత్తి, పెసర, కూరగాయ పంటలతో పాటు వరి నారుమడులు పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం పరిధిలోని తిమ్మాపూర్, చీకోడు, ఆరెపల్లె , ఆకారం గ్రామాలను రైతులు సాగు చేస్తున్న వర్షధారిత, ఆరుతడి పంటలు వ్యవసాయ క్షేత్రాలను  తోర్నాల(వ్యవసాయ పరిశోధన స్థానం)ప్రధాన శాస్త్రవేత్త  అధిపతి డా. ఎస్. శ్రీదేవి, జె. విజయ్, కో ఆర్డినేటర్, ఏరువాక కేంద్రం, తోర్నాల శాస్త్రవేత్త (బ్రీడింగ్) ఎ. సరిత ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్లతో కలిసి గురువారం సందర్శించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరి, మొక్కజొన్న, పెసర, కంది, కూరగాయ పంటలలో తీసుకోవలసిన తగు చర్యల గురించి తెలియజేశారు. అనంతరం పురుగు ఆశించిన పంట పొలాలలో చేయవలసిన మందుల పిచికారి గురించి వివరించారు. అధిక వర్షాల కారణగా ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ చేనులో నుండి నీటిని తీసివేయాలని సూచించారు.పత్తి పొలాలకు పచ్చదోమ ఆశించినదని గమనించి, దీని నివారణకు వర్షాలు తగ్గిన తరువాత మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. పిచికారి చేయాలని సూచించారు, అలాగే అధిక వర్షాల కారణoగా మొక్కలు ఎండిపోవడం గమనించినట్లైతే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి మొక్కల అడుగు భాగం తడిసేల పోయాలని తెలిపారు. పై పంటలకు పోషకాలు అందించటానికి 19:19:19 లేదా యూరియా 10 గ్రా. ని లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని  పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి నారు మడి దశలో మరియు కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసి 10 రోజులు అవుతుంది. ప్రధానంగా పొలంలో నీరు నిలిచినట్లితే నీరు నిలవకుండా బయటకు వెళ్ళేల కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న లో కత్తెర పురుగు ఉధృతి వలన ఆకుల పై రంద్రాలను గమనించి, ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటర్ నీటికి కలిపి వర్షాలు తగ్గిన తరువాత మొక్క సుడిలో పిచికారి చేయాలని చెప్పారు. పెసరలో పల్లాకు తెగులు నివారణకు వర్షాలు తగ్గిన తరువాత మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. పిచికారి చేస్తే  పంటలను కాపాడుకోవచ్చని
తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారులుచైతన్య,అస్మా,హరీష్, చీకోడు గ్రామ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లు సైదుగారి ఎల్లం, ముత్తరెడ్డి, పలువురు  రైతులున్నారు.
Spread the love