– మండల వ్యవసాయ అధికారి ఆశా కుమారి..
నవతెలంగాణ చివ్వేంల: మండలంలో(18-6-2024) లోపు నూతనంగా రైతు పట్టా బుక్కు వచ్చిన రైతులందరూ రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలని, మండల వ్యవసాయ అధికారి ఆశా కుమారి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 18నుంచి 59 సంవత్సరాల వయసు గల (14-81964నుండి 14-8-2005) గల రైతులు రైతు భీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని, రైతు వేదికకు రైతులు స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసు బుక్కు, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్లు స్థానిక ఏ ఈ ఓ లకు ఇచ్చి రైతు బీమా ను నమోదు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.