Allu Arjun | Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయ్యేది అక్కడే..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అది అలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి