
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అల్లూరి వాణిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఎ వాణిరెడ్డి గ్రేట్ టు నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా ప్రమోషన్ లో మీర్ పేట్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వచ్చారు. మీర్ పేట్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన సీఎచ్ నాగేశ్వర్ రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు.