విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలి

నవతెలంగాణ – ధర్మసాగర్
అందరికీ ఉచిత విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని జన పోరాట సమితి వ్యవస్థాపకులు బొడ్డు భరత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాలు ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొఠారి కమిషన్ అమలు చేయాలి, దేశ భవిష్యత్తు తరగతి గదులు రూపుదిద్దుకుంటుందిని,అలాంటి విద్యను అంగడి సరుకుగా చేసి చదువును కొనుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అలా కాకుండా విద్య ద్వారా ఉపాధి జీవన విలువలు పెంపొందించి జీవితంపై నమ్మకం ఏర్పడే విధంగా విద్యా వ్యవస్థను రూపొందించాలిని కోరారు.మన ఊరు మనబడి కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా నమ్మకం విశ్వాసం కలిగే విధంగా రాజకీయ ప్రవేశం తగ్గించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయుతర స్కావెంజర్ వాచ్ మెన్ మరియు పర్యవేక్షణ అధికారులను వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బడులల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్నాక్స్ పాలు పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మ ప్రకాష్, సురేష్, విద్యా కమిటీ చైర్మన్ చిలుక సదానందం, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, రాజమ్మ,కిరణ్ బాయ్, పద్మజా అనిత, ప్రసన్న, సునీత విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love