అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

నవతెలంగాణ-హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షల రీషెడ్యూల్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.