ప్రమాద అంచులో అంగన్వాడి కేంద్రం పల్లె దవఖాన కేంద్రం

– పైకప్పు ఉచ్చులు ఊడి పడుతున్న బిల్డింగ్ 

– భయం గుప్పిట్లో అంగన్వాడి కేంద్ర పిల్లల తల్లిదండ్రులు
– కొత్త బిల్డింగ్ నిర్మించాలని లచ్చన్ గ్రామస్తుల విజ్ఞప్తి
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రం అలాగే పల్లె దవాఖాన కేంద్రం పురాతనమైన బిల్డింగ్లో కొనసాగుతున్నాయి. ఈ బిల్డింగు పైకప్పు ఉచ్చులు ఊడి పడుతున్నాయి. పురాతనమైన బిల్డింగులు కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రం చదువుల కెళ్ళే పిల్లల తల్లిదండ్రులు పురాతనమైన బిల్డింగ్ పట్ల ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. లచ్చన్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రానికి పల్లె దవాఖానాకు కొత్త బిల్డింగులు నిర్మిస్తే బాగుంటుందని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పాత బిల్డింగ్ లో చిన్నారి పిల్లలు చదువుకోవడం పాత బిల్డింగ్ పట్ల పైకప్పు ఉచ్చులు ఊడిపడడం తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల భయం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్డింగును సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రభుత్వ స్థలంలో కొత్త బిల్డింగులు నిర్మించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు కోరుతున్నారు.