నవతెలంగాణ -తాడ్వాయి
వార్షిక సమీక్షాఅర్ధ సమావేశంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ. బి.శ్రీనివాస రెడ్డి గారు పోలీస్ స్టేషన్, సర్కిల్ మరియు సబ్ డివిజన్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు మరియు కేసు ఫైలు పరిశీలించి ఎస్సైలు, సిఐలు, డిఎస్పీ గార్లకు వేగవంతంగా విచారణ పూర్తి చేసి, కోర్టుల యందు కూడా సరియగు సమయములో సాక్షులనుప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తెసుకోవాలని తెలియజేశారు. శిక్షల రేటు (కన్విక్షన్) పెంచడము వలన నేరస్తులకు శిక్ష కచ్చితంగ పడుతుంది అనే భయము కలిగి నేరాలు తగ్గుతాయని సూచనలు చేశారు.. వర్షాలు ఎడతెరుపు లేకుండా కురవడం వలన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఎక్కడైనా ప్రమాదము కలిగే విదముగా అవకాశం ఉన్నది అని తెలువగానే వెంటనే తగు చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన మరియు కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 22 మంది యస్.ఐ అధికారులను జోన్-III రాజన్న లోని మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు బదిలీ కాగా వారు జిల్లాలో అందించిన సేవలకు గాను జిల్లా యస్పి అందరినీ సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో OSD జే. అన్యోన్య , బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు మరియు అందరూ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.