తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌ సెంటర్‌
– రూ.3వేల కోట్ల పెట్టుబడులు
– ఐదేండ్లలో 1500 మంది ఉపాధి అవకాశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో మరో అంతర్జాతీ య సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్‌ కేర్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ విస్తరణ ప్రణా ళికలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.3వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్నో వేషన్‌, మెడికల్‌ డివైజెస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఐదేండ్లలో 1500మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రతి నిధులు సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికల గురించి వివరిం చారు. లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ లీడర్‌గా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములమవుతు న్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మెడ్‌ట్రానిక్‌ సర్జికల్‌ ఎగ్జి క్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రెసిడెంట్‌ మైక్‌ మరీనా మాట్లాడుతూ మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్క రణలకు భారతదేశం నయా గమ్య స్థానంగా మారిందని తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ రంగంలో హైదరా బాద్‌ ప్రాధాన్యతను గుర్తించిన తర్వాతే తాము ఈ పెట్టుబడి ప్రకటన చేస్తు న్నామని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వంతో కలిసి పనిచేస్తున్నందకు గర్వం గా ఉందని మైక్‌ మరీనా చెప్పారు.
లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేం దుకు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు. మెడ్‌ట్రా నిక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సైట్‌ లీడర్‌ దివ్య ప్రకాష్‌జోషి మాట్లాడుతూ హెల్త్‌ కేర్‌ టెక్నాలజీలో ఆవిష్కరణలు, పురో గతికి ఆర్‌అండ్‌డీలో తాము పెడు తున్న పెట్టుబడి పునాది అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్‌ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తమ పోటీ ప్రపంచంతోనే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న పట్టుకు, పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్‌ తాజా పెట్టుబడే నిదర్శ నమని తెలిపారు. హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని ప్రోత్సహించ డానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్‌ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతోపాటు మెడ్‌ ట్రానిక్స్‌ విస్తరణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్య దర్శి జయేష్‌ రంజన్‌, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌సైన్సెస్‌ సీఈఓ శక్తి ఎం నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love