నవతెలంగాణ – భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. బార్‌గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్లోని ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను దారి మళ్లించారు. ఘటనాస్థలిలో రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇవాళ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లైమ్ స్టోన్‌ను తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొన్న జరిగిన ప్రమాదానికి 500 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.