పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

Pawan-Kalyanనవతెలంగాణ – అమరావతి
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కొత్త ట్విస్ట్. జనసేనాని చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నట్లుగా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. వారిపై దురుద్దేశ్యపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పరువుకు నష్టం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అంటోంది. అంతేకాదు, వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని చెబుతోంది. వారిని అవమానించేలా, విషపూరిత వ్యాఖ్యలు చేశారని చెబుతోన్న ప్రభుత్వం, ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.