పేకాటరాయుళ్ల అరెస్టు

 నవతెలంగాణ- రామారెడ్డి

మండల కేంద్రంలో పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు, పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేసి, పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రూ 1500 సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని, మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.