కనీసం మూడు మొక్కలు నాటాలి

సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌ వ్యాప్తంగా 11 ఏరియాల్లో హరితోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌ తెలిపారు. జీవుల మనుగడ, పుడమి భవిత కోసం ప్రతి వ్యక్తి కనీసం మూడు మొక్కలు నాటి, పెంచాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో హరితోత్సవ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా గత 8 ఏండ్లలో సింగరేణి వ్యాప్తంగా 5.71 కోట్ల మొక్కలను నాటామ న్నారు. ఫలితంగా ఉష్ణోగ్రతల నియంత్రణ సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ కో ఆర్డినేషన్‌ ఎమ్‌ సురేష్‌, మైనింగ్‌ సలహాదారు డీఎన్‌ ప్రసాద్‌, అధికారుల సంఘం జనరల్‌ సెక్రెటరీ ఎన్‌వి రాజశేఖర్‌రావు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love