బ్యాగ్‌ రికవరీ.. బాధితులకు అందజేత

నవతెలంగాణ-కూకట్‌పల్లి
రూ.5 లక్షల విలువ చేసే రెండు బంగారు రుద్రాక్షలు, రూ.20 వేల నగదు, విలువైన పత్రాలు గల బ్యాగ్‌ పోయిందనే ఫిర్యాదు అందిన ఒక్క రోజులోనే కూకట్‌పల్లి పోలీసులు బ్యాగ్‌ను రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ వివరాల ప్రకారం నిమ్మరాజు శేషు కుమార్‌ అనే వ్యక్తి ఈ నెల 20వ తేదీన ఆటోలో కూకట్‌పల్లిలోని సుమిత్రనగర్‌కు వస్తుండగా, మార్గ మధ్యలో తన విలువైన వస్తువులు గల బ్యాగ్‌ మిస్సైందని 21వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌గౌడ్‌ ఆదేశాల మేరకు క్రైమ్‌ పోలీసులైన కబీర్‌, శ్రీకాంత్‌ ఇద్దరూ కలిసి సీసీ కెమెరాల ఆధారంగా, బ్యాగ్‌ దొరికిన వ్యక్తిని గుర్తించి ఆభరణాలు గల విలువైన బ్యాగ్‌ను బాధితుడికి అందజేశారు.

Spread the love