త్యాగాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో బక్రీద్

– ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
– ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లింలు
– అల్లా పేరిట గొర్రెలను బలిదానం
– పగడ్బందీగా పోలీస్ బందోబస్తు
నవతెలంగాణ – కంటేశ్వర్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అల్లా తమను చల్లగా చూస్తాడు అని విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి ముస్లింలు నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు ఖురాన్ ను పఠించి అల్లా పేరిట గొర్రెలను బలిదానం ఇచ్చారు. ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలు రంజాన్ పండుగ తర్వాత బక్రీద్ కు రెండో ప్రాధాన్యత ఇస్తారు. ముస్లింలు ఈద్గాలో నమాజ్ నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రధాన వీధుల అయిన బర్కత్ పుర ఖిల్లా రోడ్డు ఆజం రోడ్ గోల్ హనుమాన్ శాంతినగర్ ప్రాంతాల్లో మసీదులు ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ధనికులు పేదలు అనే తారతమ్యం లేకుండా సమాజంలో అందరూ ఒకటే అనే భావన కలగాలని మత పెద్దలు బోధించారు. అంతా ఒకటే అనే భావన ప్రేమాభిమానాలు సమైక్యత సామరస్యాలు నెలకొల్పడంలో పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర వెళ్ళాలనేది ఇస్లాంలో నిబంధనఅని తెలిపారు .ఆర్థిక స్తోమత గల ప్రతి ఒక్కరూ పేదలకు దానధర్మాలు చేయాలని సూచించారు. ముస్లింలు కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చనిపోయిన వారికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బక్రీద్ పండుగ లో మరొక ముఖ్యమైనది ఇబ్రహీం ను స్మరిస్తూ గొర్రెపోతు బలిదానం ఇచ్చారు. బలిదాన్ నుంచి గొర్రె పోతుల లో ఒక భాగాన్ని పేదవారికి దానం చేశారు. బలిదానం ఇచ్చేందుకు సిద్ధమైన ఇబ్రహీం ఇస్మాయిల్ ను తలుచుకుంటూ పాయసం బిర్యానీ ప్యాకెట్ లు దుస్తులు నిత్యావసర సరుకులను ముస్లిం పేదవారికి దానం చేశారు. నగరంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
పగడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇన్చార్జి నిజామాబాద్ పోలీస్ కమిషనర్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీస్ సిబ్బందిని ఇన్చార్జి నిజాంబాద్ పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎప్పటికప్పుడు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ఎసిపిలతో మాట్లాడుతూ ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఈగల వద్ద మసీదుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్మూర్ బోధనలలో ఏసీపిల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలను తిరుగుతూ బందోబస్తును పర్యవేక్షించారు. పండగ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.

Spread the love