అందమైన సినిమా శాంతల

కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్‌ చిత్రం ‘శాంతల’. యిర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్‌ ఆర్ట్స్‌ పతాకంపై నూతననటుడు నిహాల్‌ కోదాటి హీరోగా, ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ఆశ్లేష ఠాకూర్‌ హీరోయిన్‌గా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంలో డా.యిర్రంకి సురేష్‌ నిర్మించారు. ఈ సినిమాలోని రెండు పాటలను ప్రసాద్‌ల్యాబ్‌లో శనివారం మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు శేషు మాట్లాడుతూ,’ సినిమా అద్భుతంగా రావటానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు ముఖ్యకారణం’ అని అన్నారు. ‘ఇది సంగీతం, నత్యం కలగలిపిన క్లాసికల్‌ మ్యూజిక్‌ మూవీ’ అని సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.
నిర్మాత కె.యస్‌.రామారావు మాట్లాడుతూ,’చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. మ్యూజిక్‌, కంటెంట్‌, విజువల్‌గా అద్భుతం అనిపించే సినిమా. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం మొత్తం 6 లాంగ్వేజెస్‌లో చేశాం. సినిమా మీద మా నమ్మకానికి ఇదో మంచి ఉదాహరణ’ అని తెలిపారు. హీరో నిహాల్‌ మాట్లాడుతూ,’ఇది నా హదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నా ఇష్టాలకు దగ్గరైన పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని చేశాను.మంచి సినిమా చేశాం’ అని హీరోయిన్‌ అశ్లేష ఠాకూర్‌ అన్నారు.

Spread the love