బెల్టు షాపులు వేలం వేస్తె కఠిన చర్యలు..

నవతెలంగాణ – భిక్కనూర్
గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులకు ఎవరు వేలం పాటలు వేసిన కేసులు నమోదు చేస్తామని దోమకొండ ఎక్సైజ్ సీఐ పోతిరెడ్డి హెచ్చరించారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో మంగళవారం వీడిసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్ట్ షాపుకు వేలంపాట వేసినట్లు సమాచారం అందటంతో ఆయన గ్రామానికి వెళ్లి అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనుమతి లేని బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహించరాదని, గ్రామంలో ఎవరు బెల్ట్ షాపు నిర్వహించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా దొంగ చాటుగా గ్రామాలలో మద్యం అమ్మితే తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love